14, మార్చి 2015, శనివారం

చినుకు

శ్రావన మాసపు వాన కురిసిన ఒకనాటి చలి రాతిరి...

వస్తూ వస్తూ ఆకాశంలో చుక్కల్ని ఆర్పేసిన చినుకులు

అలా ఆరుబయటకొచ్చానో లేదో

అందమైన ఓ చినుకు గాలితోపాటు ఎగిరొచ్చి

నా మదిని రివ్వునెటో తీసుకెల్లింది

ఇంకెక్కడికని నా ఆలొచనలు నీ దారి పట్టాయి

నిశ్చలమైన నిశ్శబ్దం నడిరేయి దాటిందని చెబుతోంది

కమ్ముకున్న కటిక చీకటి నన్నే గుచ్చి గుచ్చి చూస్తోంది

ఆటుగా వెల్తున్న పిల్లతెమ్మెర ఆగి

ఇంకా ఇక్కడేం చేస్తున్నావని అడుగుతోంది

ఎలా చెప్పను దానికి...

నీ కను చూపులలో చిక్కుకున్న నా హ్రుదయం

తిరిగి వస్తే కదా నే కునుకెయడానికని...?!

2 కామెంట్‌లు: