2, నవంబర్ 2015, సోమవారం

Have u ever heard some one saying u..

'నా నరాల్లో రక్తం ప్రవహిస్తున్నంతవరకు నీతోనే ఉంటాను'

16, మార్చి 2015, సోమవారం

మౌనాక్షారాలు

నీ పలుకు చినుకు కోసం ఎదురు చూసి చూసి
ఎడారిగా మారిపొతున్న నా హ్రుదయంe  నుండి
వీస్తున్న వేడి గాలుల నిట్టూర్పు  సెగలు
నిను మచ్హుకైనా తాకడం లేదా...?

కొంచెం కొంచెంగా పెరిగి పోతున్న
నీ తలపు చినుకుల భారంతో
చిదికి పోతున్న నా మది తాలూకు
కబురైనా నిను చేరడం లేదా..?

ఎడతెగని నీ ఆలోచనలతో విసిగి వేసారి  
అలసి సొలసి నిర్లిప్తా తెరలు ఆవరిస్తున్నపుడు
నా మనసు పలుకుతున్న మౌనాక్షరాల
సవ్వడులు వినిపించడం లేదా..?

నీ గురించిన ప్రశ్నలు శరాలై నలువైపుల నుండి దూసుకొస్తుంటే
సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరై పోతున్న
నా గుండె నిస్సహాయ స్థితి నిను
కాస్తైనా కదిలించడం లేదా..?

వెన్నెల

నీ మాటలు చన్నీటి చెలమలా...?
ఆరిపోయిన నా మదిని అలా తడిపేస్తాయే..

నీ చూపులు అందమైన తుమ్మెదలా...?
నా బుగ్గన ఎర్ర మందారాల్ని పూయిస్తాయే..

నీ తలపులు మలయ శీతల మారుతాలా...?
మదిలో నిట్టూర్పు సెగలను ఇట్టే మాయం చేస్తాయే..

నీ నవ్వులు పున్నమి చంద్రుని దివ్య కాంతులా...?
నా చీకటి లోకాలను వెన్నెలతో నింపేస్తాయే..

14, మార్చి 2015, శనివారం

చినుకు

శ్రావన మాసపు వాన కురిసిన ఒకనాటి చలి రాతిరి...

వస్తూ వస్తూ ఆకాశంలో చుక్కల్ని ఆర్పేసిన చినుకులు

అలా ఆరుబయటకొచ్చానో లేదో

అందమైన ఓ చినుకు గాలితోపాటు ఎగిరొచ్చి

నా మదిని రివ్వునెటో తీసుకెల్లింది

ఇంకెక్కడికని నా ఆలొచనలు నీ దారి పట్టాయి

నిశ్చలమైన నిశ్శబ్దం నడిరేయి దాటిందని చెబుతోంది

కమ్ముకున్న కటిక చీకటి నన్నే గుచ్చి గుచ్చి చూస్తోంది

ఆటుగా వెల్తున్న పిల్లతెమ్మెర ఆగి

ఇంకా ఇక్కడేం చేస్తున్నావని అడుగుతోంది

ఎలా చెప్పను దానికి...

నీ కను చూపులలో చిక్కుకున్న నా హ్రుదయం

తిరిగి వస్తే కదా నే కునుకెయడానికని...?!

6, మార్చి 2015, శుక్రవారం

నువ్వే

 ఒంటరిగా ఉన్నానా........?
 ఎవరన్నారు...........?
 ఎడ తెగని నీ అలోచనలు  ఊపిరాడనీయకుంటే....
 నీ నవ్వుల జలపాతాల హోరులో నా మదికి నా మాటే వినపడకుంటే...
 నీ కళ్ళు చెప్పిన సంగతుల వెల్లువలో నా హ్రుదయం కొట్టుమిట్టాడుతుంటే...
 నే తాకిన ప్రతివస్తువూ నీ గురించో కబురు చెబుతుంటే...
 వెనకి తిరిగి చూసిన నా ప్రతి అడుగూ  నీదే అనిపిస్తుంటే...
 నా చూపు నిలిచిన ప్రతి చోటా నువ్వే..........  కనిపిస్తుంటే..............!!